Sunday 6 September 2015

Ayatul Kursi

                               Ayatul Kursi  అయతుల్ కుర్సి

 బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ 
అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ఫ్రారంభిస్తున్నాను.

1. అల్లాహ్ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్
2. లా తఉ ఖుజుహు సినతువ్ వలా నౌమ్.
3. లహూ మా ఫిస్ సమావాతి వమాఫిల్అర్జ్.
4. మన్ జల్లజీ యష్ ఫఉ ఇందహూ ఇల్లా బి ఇజ్నిహ్. 
5.  య అలము మాబైన అయ్ దీహిమ్ వమా ఖల్ ఫహుమ్. 
6. వలా యుహీతూన బిషయ్ ఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమాషాఅ.
7. వసిఅ కుర్సియ్యు హుస్ సమావాతి వల్ అర్జ్. 
8. వలాయ ఊదుహూ హిఫ్ జుహుమా . 
9. వహువల్ అలియ్యుల్ అజీమ్


భావం:
1. అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు.
2. ఆయన ఎల్లప్పుడూ సజీవుడు, నిత్యుడు, అనంతుడు. సకల సృష్టికి మూలధారం.
3. ఆయనకు నిద్రరాదు, కునుకు రాదు.
4. భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరు సిఫారసు చెయ్యగలరు?
5. జీవులకు ముందు వెనకలలో ఎముందో ఆయనకు తెలుసు.
6. ఆయన కొరిన మేర తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయం గ్రహించలేరు.
7. ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను ఆవరించి ఉన్న్దది.
8. ఆ రాజ్య సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు.
9.  ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు .